నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 17:12

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు..

ఈ మేరకు ప్రముఖ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌ సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఇది చర్చనీయాంశంగా మారింది.

''పొలిటికల్‌ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్‌లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం, రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధాకరం'' అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

''రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లే. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం'' అని న్యాయవాదులు తమ లేఖలో కోరారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 14:31

హైకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకో ర్టు లో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్క రించింది ఢిల్లీ హై కోర్టు.

సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలని పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయపర మైన జోక్యానికి అవకాశం లేదని హై కోర్టు వెల్లడిం చింది.

జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడపడంలో చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు. దీంతో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది.

పిటిషన్ డిస్మిస్ చేసిన ఢిల్లీ హైకోర్టు…కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్కరించింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 12:09

88 స్థానాలకు రెండో విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక సమరంలో రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది.

గురువారం ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

రెండో విడుతలో ఔటర్‌ మణిపూర్‌లోని ఒక సీటు తోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగనుంది.

ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్ము కశ్మీర్‌ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 5న జరుగనుంది.

జమ్మలో మాత్రం ఏప్రిల్‌ 6న నామపత్రాలను పరిశీలించ నున్నారు. రెండో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

వీటితోపాటు మహారాష్ట్ర లోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.

కాగా, మొదటి విడుత నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:25

జనగాం ఏసీపీ పై ఈసీ వేటు

ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది.

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది...

Streetbuzz News

*SB NEWS*

Streetbuzz news

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:23

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం:ముగ్గురు మహిళలు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని హుటాహు టిన ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:22

మహబూబ్ నగర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది.

మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

ఈ ఎన్నికలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు.

ఈ నేప థ్యంలో ఇవాళ మధ్యాహ్నం కొడంగల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు.

ఎంపీడీవో ఆఫీస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఓటు వేయను న్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుండ గా .ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతు న్నారు

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:53

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు అలుముకో వడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహు టిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

5 ఫైర్ ఇంజిన్ల తో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.....

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:47

డిఎండికె పార్టీ నేత గణేష్ మూర్తి మృతి

టికెట్ రాలేదని మనస్తాపం తో తమిళనాడుకు చెందిన డీఎండీకే ఎంపీ,ఈరోడ్, గణేశమూర్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.

గత కొన్ని రోజులుగా కోయం బత్తూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఆయన ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో కన్ను మూశారు.

ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మనస్తా పానికి గురైన గణేశమూర్తి ఆదివారం మార్చి 24వ తేదీన తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.

వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కొయంబత్తూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న గణేశమూర్తికి ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:43

ఓపెన్ స్కూల్ చదివితే DSC కి నో ఛాన్స్

తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియా మక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

వీళ్లు గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన ప్పటికీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించి నట్లు సమాచారం.

తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికం గా ఉత్తర్వులు ఇవ్వనున్నా రు.

విద్యాశాఖ తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది అభ్యర్ధులు డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది...

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 09:41

నేడు మంథని లోని ఆలయాల హుండీ లెక్కింపు

మంథని పట్టణానికి చెందిన మూడు ప్రముఖ ఆలయాల హుండీలు ఈరోజు లెక్కించ నున్నట్లు ఆలయాల ఎండో మెంట్ మేనేజర్ రాజ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

మంథని పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం హుండి ఉదయం 10. 30 గంటలకు,

శ్రీ మహాలక్ష్మి దేవాలయం హుండి మధ్యాహ్నం 12. 30 గంటలకు,

శ్రీ గౌతమేశ్వర స్వామి దేవస్థానం హుండి మధ్యాహ్నం 3. 30 నిమిషాలకు లెక్కించ నున్నట్లు తెలిపారు..

Streetbuzz News